Wednesday, September 30, 2009
Tuesday, September 29, 2009
Sunday, September 27, 2009
Saturday, September 26, 2009
ఇళ్ళ నిర్మాణ దారులకు
భారీ ప్రోత్సాహకాలు
నిర్మాణానికి పలు నిబంధనలు
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, న్యూస్‌టుడే: జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని పేదవారికి తక్కువ ధరకు గృహ సముదాయాలు నిర్మించి ఇచ్చే బిల్డర్లు, సంస్థలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, డెవలపర్లు వీటి నిర్మాణానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక సమర్పిస్తే.. పరిశీలించి ధరలు నిర్ణయించడంతో పాటు ప్రోత్సాహకాలనూ ప్రభుత్వం అందజేస్తుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సీవీఎస్‌కే శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద అర్హులైన పేదలకు వారి స్తోమతకు తగ్గట్లు పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) ద్వారా తక్కువ ధరకు ఇళ్లు నిర్మించి ఇస్తారు. ఇళ్ల ధరలు ప్రభుత్వమే ఖరారు చేయనుంది. 2009 మార్చి తరువాత చేపట్టిన ప్రాజెక్టులే ఈ పథకం కిందకు వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాజెక్టు కింద గృహ నిర్మాణాలు చేపట్టే సంస్థలు కనీసం 200 ఇళ్లు నిర్మించాలని షరతు విధించారు. భవన నిర్మాణ నిబంధనల్లో కూడా మార్పులు చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పట్టణ పేదరిక నిర్మూలన ఏజెన్సీ (మెప్మా)కి అప్పగించారు. ఈ ప్రాజెక్టుకు ఏపీయూఎఫ్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల సంస్థ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇవీ నిబంధనలు
* ప్రాజెక్టు పరిధిలోకి ప్రభుత్వ ఏజెన్సీలు, లైసెన్సు పొందిన డెవలపర్లు, గృహనిర్మాణమండలి , రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, రాజీవ్ స్వగృహ, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్,రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరపాలక సంస్థలతో పాటు ఆయా నగరాల పట్టణాభివృద్ధి సంస్థలు ఈ పరిధిలోకి వస్తాయి.
* నగరాల్లో పట్టణాభివృద్ధి సంస్థలు, మిగిలిన ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో లే అవుట్లు, భవన ప్లాను, ప్రాజెక్టులు, ధరల అంశాలను నిర్ణయిస్తారు.
* నిర్మాణాలు చేపట్టే.. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు బిల్డర్లకు ల్యాండ్‌సీలింగ్ చట్టాలనుంచి మినహాయింపు ఉంటుంది.
* 80 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించే ఇళ్లకు 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు.
* వ్యవసాయ భూములను నివాస ప్రాంతాలుగా మార్పు చేయడంతో పాటుసంబంధిత లెవీ ఛార్జీల నుంచి కూడా మినహాయింపు.
ప్రత్యేక నిబంధనలు
* సముదాయం నిర్మించే మొత్తం స్థలంలో ఖాళీగా వదిలే ప్రాంతంలో కనీసం మూడు శాతానికి పైగా దుకాణాలు, ప్రజా అవసరాల నిమిత్తం కేటాయించాలి.
* సామూహిక గృహ సముదాయాల్లో ఇళ్లు కేటాయించే సమయంలో మొత్తం గృహాల్లో 25 శాతం ఈబీసీలకు 15 శాతం స్వల్ప ఆదాయ వర్గాలకు ఖచ్చితంగా కేటాయించాలి. లేఅవుట్లు, వ్యక్తిగత గృహాలను కేటాయించే సందర్భంలోకూడా ఈవిధానాన్ని పాటించాలని స్పష్టం చేశారు.
* ఐదు అంతస్తుల భవనం 15 మీటర్లు, నాలుగు అంతస్తుల భవనం 12 మీటర్లు, మూడు అంతస్తుల భవనం 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించడానికి అనుమతిస్తారు.
అవసరమైతే పోరాటం
Friday, September 25, 2009
Thursday, September 24, 2009
Resurvey of Adilabad-Armoor railway line
ADILABAD: The South Central Railway (SCR) will initiate a resurvey on the proposed Adilabad-Armoor line with a team of officials arriving in Adilabad on Wednesday.
The team, headed by the Deputy Chief Operations Manager (Survey) K.J. Reddy will be collecting data and statistics on commercial viability of a new railway line between Adilabad headquarter town and Armoor town in Nizamabad district.
The proposed line will ultimately be linked to Secunderabad via Nizamabad, according to sources.
The team will gather information regarding number of industries and other businesses that require rail transportation. The members will also interact with functionaries of the local Chamber of Commerce.
The first survey on this line was done in 1996.

